Breaking News

PACS అధ్యక్షుడు రైతు సమాజానికి మార్గదర్శి

-నెట్టెం రఘురామ్

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
నందిగామ జగ్జీవన్ రామ్ ఆడిటోరియంలో జరుగుతున్న Primary Agricultural Cooperative Societies (PACS) Presidents ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య మరియు నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి లతో కలిసి మాజీ మంత్రి, కృష్ణా జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ జ్యోతి ప్రజ్వలన చేశారు.  జగ్గయ్యపేట–నందిగామ నియోజకవర్గ పరిధిలోని 50 మంది PACS అధ్యక్షులు శిక్షణ శిబిరంలో హాజరయ్యారు. నిపుణుల పర్యవేక్షణలో చైర్మన్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక క్రమబద్ధత, సమర్థవంతమైన నిర్వహణ పద్ధతులు వంటి అంశాలపై లోతైన అవగాహన కల్పించబడింది.

ఈ సందర్భంగా నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ సహకార ఉద్యమం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని రైతుల అవసరాలను తీర్చడంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) పాత్ర అపారమని ఆయన అన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి కేవలం ఒక పదవిని కాకుండా రైతు సమాజానికి మార్గదర్శకుడిగా, రక్షకుడిగా, అభివృద్ధి ప్రేరకుడిగా ఉండాలని సూచించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, రుణాలు, మార్కెట్ సదుపాయాలు అందించడం నుండి ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించడం వరకు ప్రతి అంశంలో అధ్యక్షుడు కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. సమాజంలో నమ్మకం, ఐక్యత పెంపొందించాలి, వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమాజ ప్రయోజనాన్ని ముందుంచాలి అని ఆయన వివరించారు. ప్రభుత్వ పథకాలను రైతులకు చేరవేయడంలో, నూతన ఆలోచనలు పరిచయం చేయడంలో PACS వేదికగా నిలవాలని అన్నారు. ఆధునిక సాంకేతికత, డిజిటలైజేషన్ ద్వారా సమాజం మరింత బలోపేతం అవుతుందని సూచించారు. అవినీతి రహిత, పారదర్శక వ్యవస్థ ద్వారా మాత్రమే రైతుల నమ్మకం గెలుచుకోవచ్చని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం, గ్రామాభివృద్ధి కార్యక్రమాలలో ముందుండి పనిచేయడం అధ్యక్షుని నైతిక బాధ్యత అని రఘురామ్ పేర్కొన్నారు. PACS బలంగా ఉంటే రైతులు బలంగా ఉంటారు, రైతులు బలంగా ఉంటే గ్రామం, జిల్లా, రాష్ట్రం బలపడతాయని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు సీఈఓ శామ్ మనోహర్, జిఎం రంగబాబు, DPDM కలాధర్, KDCC డీజీఎం కాగిత శ్రీనివాసులు, AGM ఎన్. శ్రీదేవి, లెక్చరర్ రమణారావు (APCOB CTI), రిటైర్డ్ లెక్చరర్ కోటేశ్వరరావు ప్రత్యేకంగా హాజరై, పాల్గొన్న వారికి మార్గదర్శకత్వం వహించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *