రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నానో యూరియా, బయో ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించడానికి ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు తెలిపారు. శనివారం రాజమహేంద్రవరం రూరల్ మండలం, తొర్రేడు గ్రామంలో నానో ఎరువులు, బయో ఎరువులపై ప్రదర్శన మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు మాట్లాడుతూ, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డిల్లీ రావు సూచనల మేరకు, నానో యూరియా ప్రయోజనాలు, ఉపయోగ విధానం రైతులలో విస్తృతంగా చేరేలా తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్యేక షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మన్నారు. రైతులు రసాయన ఎరువులపై ఆధారపడకుండా బయో మరియు నానో ఎరువులను ప్రోత్సహించి వాడాలని, ఇది పర్యావరణానికి మేలు చేస్తుందని, స్థిరమైన వ్యవసాయానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. రైతులు అవగాహనతో ముందడుగు వేస్తే భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించవచ్చని అన్నారు..షెడ్యూల్ ప్రకారం .06.09.2025: మండల స్థాయిలో బయో మరియు నానో ఎరువుల భారీ ప్రదర్శనలు చేపట్టినట్లు తెలిపారు. 12.09.2025: మానవ హారం, 15.09.2025: గ్రీవెన్స్ డే నాడు నానో, బయో ఎరువులు ఉపయోగిస్తున్న రైతులకు సన్మానం చేయడం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. శాస్త్రవేత్తలు, నిపుణులు ఈ సందర్భంగా మాట్లాడుతూ నానో ఎరువుల వినియోగం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా పంటల ఉత్పాదకత పెరుగుతుందని, నేల ఆరోగ్యం కాపాడబడుతుందని తెలిపారు. రైతులు స్వయంగా తయారు చేసుకోవచ్చని, ఆధునిక సాంకేతికతతో తయారీ విధానం సులభమైందని వివరించారు.
ఈ కార్యక్రమంలో డిపిఎం, ఎపిసిఎన్ఎఫ్ ప్రతినిధులు, ఏడిఏ రాజమహేంద్రవరం, ఎంఏఓ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News