“స్వర్ణ ఆంధ్ర విజన్–2047” లో తూర్పు గోదావరి జిల్లా రాష్ట్రంలో 1వ స్థానం

-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మార్గదర్శకం, దిశా నిర్దేశం తో సాధ్యం
-డి ఎమ్ హెచ్ వో వెంకటేశ్వర రావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా రాష్ట్రవ్యాప్తంగా అమలవు తున్న “స్వర్ణ ఆంధ్ర విజన్–2047” కార్యక్రమంలో 92% పనితీరు సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని పొందిందనీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె వెంకటేశ్వర రావు గురువారం ఒక ప్రకటన లో తెలియ చేశారు. జిల్లాలో పిల్లలకు పూర్తి టీకాలు అందించడం, శిశు మరణాల రేటు తగ్గుదల, న‌వజాత శిశు మరణాల రేటు తగ్గింపు, ఐదేళ్ల లోపు పిల్లల మరణాల రేటు తగ్గింపు, మాతృ మరణాల రేటు తగ్గుదల, గర్భిణీ స్త్రీలలో రక్తహీనత నివారణ, జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల సౌకర్యాల కల్పన, ఎన్‌సీడీ ఫాలోఅప్, క్షయరోగం విజయవంతమైన చికిత్స రేటు, డెంగ్యూ కేసుల మరణాల నిష్పత్తి తగ్గింపు వంటి కీలక పనితీరు సూచికల్లో జిల్లా A+ రేటింగ్ సాధించిందన్నార్

జిల్లా కలెక్టర్ శ్రీమతి P. ప్రశాంతి గారి మార్గ దర్శకత్వంలో, జిల్లా వైద్య మరియు ఆరోగ్యాధికారి డాక్టర్ కి. వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కే భాస్కర్ రెడ్డి, అదనపు డీఎంహెచ్ఓల పర్యవేక్షణలో, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, వైద్యులు, ANMలు, ASHAలు, పారామెడికల్ సిబ్బంది మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది సమిష్టి కృషి ఫలితంగా ఈ విజయాన్ని సాధించామని జిల్లా వైద్య మరియు ఆరోగ్యాధికారి తెలిపారు.

ఆరోగ్య రంగంలో అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి జిల్లా ఆసుపత్రుల వరకు మౌలిక సదుపాయా లను బలోపేతం చేయడం దిశగా జిల్లా అధికారులు కృషి కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణలో సమగ్ర సేవలు అందించేందుకు పరిశుభ్రత, తాగునీరు, మాతా–శిశు ఆరోగ్యం, అంటువ్యాధుల నియంత్రణ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు వంటి విభాగాల్లో సమన్వయంతో ముందుకు సాగుతున్నామని కూడా వెల్లడించారు.

ఈ విజయాన్ని నిలబెట్టుకోవడమే కాక, మరింత ఉన్నత ఫలితాలు సాధించడానికి భవిష్యత్తులో కూడా ఆరోగ్య సిబ్బంది కృషి కొనసాగించాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య మరియు ఆరోగ్యాధికారి డాక్టర్ కి. వెంకటేశ్వరరావు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *