జాతీయ మహిళా సాధికారిత సదస్సు కు సంబంధించి లైజన్ అధికారులు బాధ్యతగా తమ విధులను నిర్వర్తించాలి

-ఆంధ్రప్రదేశ్ లేజీస్లేటివ్ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్
-ఈ నెల 14, 15 వ తేదీ లలో జిల్లా నందు జరగనున్న జాతీయ మహిళా సాధికారిత సదస్సు ను విజయవంతo చేయాలి : జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 14, 15 వ తేదీ లలో జరగనున్న జాతీయ మహిళా సాధికారిత సదస్సుకు విధులు కేటాయించిన లైజన్ అధికారులు బాధ్యతగా తమ విధులను నిర్వర్తించాలి అని ఆంధ్రప్రదేశ్ లెజీస్లేటివ్ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరము నందు జాతీయ మహిళా సాధికారత సదస్సు కు సంబంధించిన లైజన్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ శ్రీ ప్రసన్నకుమార్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ డిఆర్ఓ నరసింహులుతో కలిసి పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ మాట్లాడుతూ.. జిల్లాలో 14,15వ తేదీల్లో జరగనున్న జాతీయ మహిళా సాధికారిత సదస్సుకు కేటాయించిన లైజన్ అధికారులు బాధ్యతగా వారి విధులను నిర్వహించాలని తెలిపారు. ముందస్తుగా కార్యక్రమాల వివరాలను తెలుసుకుని ఉండాలన్నారు.ప్రతి ప్రతినిధికి ఒక లైజన్ అధికారి, ప్రతి రాష్ట్రానికి ఒక నోడల్ అధికారిని కేటాయించడo జరుగుతుందని తెలిపారు.

జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 14,15వ తేదీల్లో జరగనున్న జాతీయ మహిళా సాధికారిత సదస్సును విజయవంతం చేయాలని విధులు కేటాయించిన లైజన్ అధికారులకు సూచించారు. వివిధ రాష్ట్రాల నుండి మహిళా ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారని,వారికి గ్రౌండ్ రిడ్జ్ , తాజ్, మానస సరోవరం, కెన్సెస్ హోటల్ నందు అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వారికి ఎలాంటి లోటుబాట్లు లేకుండా లైజన్ అధికారులు విధులు నిర్వహించాలని తెలిపారు. రైల్వే స్టేషన్, ఏయిర్పోర్ట్ నందు రిసెప్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో సదస్సుకు సంబంధించి కంట్రోల్ రూమ్ కూడా ఉంటుందని అన్నారు. ఈ సదస్సు ముగింపు వరకు విధులు కేటాయించిన లైజన్ అధికారులు సమయానికి అనుగుణంగా వారికి అందుబాటులో ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ వి ఆర్ చంద్రమౌళి, తిరుపతి ఆర్ డి ఓ రామ్మోహన్, ప్రోటోకాల్ డిప్యూటీ కలెక్టర్ శివరాం నాయక్, జిల్లా అధికారులు, లైజనింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *