లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

-ఎంపీ కేశినేని శివనాథ్ భరోసా

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ భరోసా ఇచ్చారు. తిరువూరు అష్టలక్ష్మి ఆలయం సమీపంలో తిరువూరు లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశానికి ఎంపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సందర్భంగా లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ బోర్డర్ లో ఉన్న తమకు సింగిల్ పర్మిట్ విధానము ఇబ్బందికరముగా ఉందని,తమ ఆఫీస్ కు కొన్ని కారణముల వల్ల తొలగించిన విద్యుత్ మీటర్లను పునరుద్దరించాలని, ఎ.టి.ఎస్ విధానములో ఫిటెనెస్ సెంటర్ను తమకు సమీపంలో ఏర్పాటు చేయాలని, కల్లాల్లో ధాన్యము తోలకము ముఖ్యమైనది. కానీ మధ్యవర్తులు వల్ల బయట లారీలతో లోడ్ చేయించి మమ్ములను ఇబ్బందులు పెట్టుచున్నారని, తిరువూరు లో ఆటోనగర్ ఏర్పాటుకు కృషి చేయాలని, లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ కు పక్క ఇల్లు మంజూరు, ఆటో డ్రైవర్ల తరహాలోనే తమను కూడా ఆదుకోవాలని వంటి సమస్యలను ఎంపీకి వివరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని ఎంపీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తిరువూరు మండల లారీ అసోసియేషన్ ప్రతినిధులు లాలం వెంకటేశ్వరరావు, తోటకూర వెంకట కృష్ణ, ఎస్.కె. యాకుబ్, కంచి రామ కృష్ణ, ఉండవల్లి సతీష్, ఎస్.కె మస్తాన్, చెరుకూరి జానకిరామ్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *