Breaking News

కీర్తిశేషులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ కి ఘన నివాళులు

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి కీర్తిశేషులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నేషనల్ మైనార్టీస్ డే సందర్భంగా ఒంగోలు నగరంలోని అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన BJMC రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా , BJMC ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ సిద్ధాంబీ , BJMC ప్రకాశం జిల్లా అధ్యక్షులు పఠాన్ సాజీద్ ఖాన్, BJMC రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉప్పుగుండూరి వెంకటేశ్వరరావు, కరాటే కోచ్ షేక్ కరీముల్లా ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ ఖలీఫాతుల్లా basha మాట్లాడుతూ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి విద్యారంగ అభివృద్ధికి పాటుపడిన మహోన్నత వ్యక్తి మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ అన్నారు. దేశ స్వతంత్రం కోసం ఆనాడు త్యాగాలు చేసిన వ్యక్తులలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒక వ్యక్తి అని ఆయన జీవితాంతం దేశ అభివృద్ధి కోసం పాటుపడ్డారని తెలిపారు. కార్మికులతో పాటు ప్రజలందరూ ముఖ్యంగా మన మైనార్టీ సోదరులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లి పేద విద్యార్థుల విద్యాభ్యాసం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *