-బిల్డింగ్ వర్క్స్ అసోసియేషన్ వనసమారాధనలో ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లాలో శ్రామికుల, కార్మికుల సంక్షేమం అభ్యున్నతికి కృషి చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పట్టణంలో సిరివెంచర్ మామిడి తోటలో తిరువూరు బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్తీక మాస వనసమారాధన కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఎంపీ కేశినేని శివనాథ్ కు తిరువూరూ బిల్డింగ్ వర్క్స్ అసోసియేషన్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఎంపీ కేశినేని శివనాథ్ నాయకులతో కలిసి అక్కడే భోజనం చేశారు. అంతకు ముందు బిల్డింగ్ వర్క్స్ అసోసియేషన్ నాయకులతో మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులు తెలుసుకున్నారు. బిల్డింగ్ వర్క్స్ లో నైపుణ్యం మరింత పెంచేందుకు హైదరాబాద్ లో లాగా, అమరావతి లో కూడా నేషనల్ అకాడమీ ఆప్ కనస్ట్రక్షన్ ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల హైదరాబాద్ లోని ఎన్.ఎ.సి ను కూడా పరిశీలించి రావటం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో తిరువూరూ బిల్డింగ్ వర్క్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేముల రమేష్ (యేసు), కార్యదర్శి షేక్ కాసీం సాహేబ్ , నాయకులు షేక్ రసూల్, కామాల రామారావు, పింగళి శ్రీను, షేక్ మస్తాన్, షేక్ ఇసూబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు సంఘం నాయకులు చెరుకూరి నాగేశ్వరరావు, నియోజకవర్గ అబ్జర్వర్ సుఖవాసి శ్రీనివాసరావు, తిరువూరు మండలపార్టీ అధ్యక్షుడు దుబ్బాకుల వెంకటేశ్వర్లు లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News