-కాకతీయ కమ్మ సేవా సమితి వనసమారాధనలో ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కుల, మతాలకు అతీతంగా సమాజాభివృద్ధికి తోడ్పాడాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పట్టణంలో లక్ష్మీపురం వద్ద గల మామిడి తోటలో కాకతీయ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్తీక మాస వనసమారాధన కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఎంపీ కేశినేని శివనాథ్ కు కాకతీయ కమ్మ సేవా సమితి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనను ఆసక్తిగా తిలకించి వారిని శాలువాతో సత్కరించారు. అలాగే కాకతీయ సేవా సమితి సభ్యులను కూడా సన్మానించారు.
అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కాకతీయ కమ్మ సేవా సమితి సేవా కార్యక్రమాలు కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల్లోని పేద ప్రజలకు చేరువకావాలని ఆకాంక్షించారు. తన సహకారం వుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు సంఘం నాయకులు చెరుకూరి నాగేశ్వరరావు, మాజీ ఎ.ఎమ్.సి చైర్మన్ తాళ్లూరి రామారావు, తిరువూరు క్లస్టర్ ఇన్చార్జ్ కిలారు శివరామకృష్ణ, స్టేట్ లీగల్ సెల్ నాయకుడు ఎస్.జనార్ధనరావు, మాజీ ఎమ్.పి.పి గద్దె వెంకటేశ్వరరావు, విస్సన్న పేట మండల పార్టీ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసరావు (డాబా శ్రీను), సీనియర్ నాయకులు ఎన్, వెంకటేశ్వరరావు (బద్దె), విస్సన్న పేట మండల పార్టీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, నియోజకవర్గ అబ్జర్వర్ సుఖవాసి శ్రీనివాసరావు, ఎన్.టి.ఆర్. జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి మాదల హరిచరణ్ (కిట్టు), ఎ.కొండూరు మండలపార్టీ అధ్యక్షుడు పీక్లా నాయక్, తిరువూరు పట్ణణ పార్టీ అధ్యక్షుడు మల్లెల శ్రీనివాసరావు, తిరువూరు మండలపార్టీ అధ్యక్షుడు దుబ్బాకుల వెంకటేశ్వర్లు లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News