-ఈ నెల 10న నామినేషన్ల స్వీకరణ
-ఎన్నికల అధికారి యం. రాజుబాబు
మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఏపీ ఎన్జీజివోస్ అసోసియేషన్ మైలవరం తాలూకా యూనిట్ కు ఈ నెల 18న ఎన్నికలు నిర్వహిస్తున్నామని, 10న నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని ఎన్నికల అధికారి,యం. రాజుబాబు ప్రకటనలో తెలిపారు.
ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ మైలవరం తాలూకా కు ఎన్నికలకు సంబంధించి ఈనెల 6 వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని ఆయన తెలిపారు. డిసెంబర్ 10 న మైలవరం ఆర్ అండ్ బి గెస్ట్ నందు నామినేషన్లుస్వీకరించడంజరుగుతుందన్నారు. తాలూకా యూనిట్ కు సంబంధించి ఒక అధ్యక్షుడు ఒక సహధ్యక్షులు ఒక కార్యదర్శి, ఒక కోశాధికారి మూడు ఉపాధ్యక్షులు మూడు సంయుక్త కార్యదర్శిలు ఒక మహిళ సంయుక్త కార్యదర్శి కలిపి మొత్తం 11 పోస్టులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నామినేషన్లు ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం12.30 వరకు స్వీకరిస్తామని, అనంతరం అదేరోజు నామినేషన్ల పరిశీలన, అర్హుల జాబితా ప్రకటిస్తామని నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని తెలిపారు .ఒక పోస్ట్ కు ఒక్కరు మాత్రమే నామినేషన్లు వేసినట్లయితే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడం జరుగుతుందని, ఏదైనా పోస్టుకు ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వచ్చినట్లయితే ఈనెల 18 న ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. అదేరోజు కౌంటింగ్ ఫలితాలను కూడా ప్రకటించడం జరుగుతుందన్నారు. సహాయ ఎన్నికల అధికారిగా కంచికచర్ల తాలూకా యూనిట్ అధ్యక్షుడు కె శివారెడ్డి ను, ఎన్నికల పరిశీలకులుగా జిల్లా ఉపాధ్యక్షుడు జి రామకృష్ణను జిల్లా అధ్యక్షులు డి సత్యనారాయణ రెడ్డి నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News