Breaking News

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బి.యల్.ఒ విధుల నుండి విముక్తి కల్పించాలి…

-గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్
-పని వత్తిడితో అల్లాడుతున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బి.యల్.ఒ విధుల నుండి విముక్తి కల్పించాలని రాష్ట్ర ఎలక్టోరల్ అధికారికి, రాష్ట్ర ఎన్నికల అధికారికి, సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యదర్శికి,రాష్ట్ర సంచాలకులకు వినతి సమర్పించిన గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా రాష్ట్ర ప్రధానకార్యదర్శి బత్తుల.అంకమ్మరావు రాష్ట్ర ప్రధానకార్యదర్శి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వివిధ రకాల విధులు నిర్వర్తిస్తూ పనివత్తిడికి గురి అవుతున్న సందర్భంలో ఉద్యోగులు మానసికంగా అనారోగ్యానికి గురికావడంతో పాటు వత్తిడి కారణంగా మృతి చెందుతున్న సంఘటనలు సంభవిస్తున్న కారణంగా, శుక్రవారం రోజు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రఅధ్యక్షుడు ఎం.డి.జాని పాషా రాష్ట్ర ప్రధానకార్యదర్శి బత్తుల.అంకమ్మరావు ల ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులకు బూత్ లెవెల్ అధికారుల
విధుల నుండి విముక్తి కల్పించాలని, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి 30-05-2022న కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలను అనుసరించి 14 విభాగాల ఉద్యోగులకు బూత్ లెవెల్ అధికారులుగా నియమించే విధంగా మెమో విడుదల చేసినప్పటికీ,13 విభాగాల వారిని పూర్తిగా మినహాయించి వరుస సంఖ్య 14లో ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను బి.యల్.ఒ లుగా నియమించడం పట్ల ఉద్యోగులు తీవ్ర పని వత్తిడికి గురి అవుతున్నారని, క్షేత్ర స్థాయిలోని ఎన్నికల అధికారులు యస్.ఐ.ఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు సంభందించి) ఓట్ల వెరిఫికేషన్ కు రోజువారీ టార్గెట్ల పేరిట వేధింపులకు గురి చేస్తున్నారని,జాబ్ చార్ట్ విధులు, ప్రభుత్వ ప్రాధాన్యత కలిగిన సర్వేలు మరియు పనులకు,అదనంగా ఎన్నికల విధులు కేటాయించడంతో సచివాలయ ఉద్యోగులు పని వత్తిడి భరించలేకపోతున్నారు. వీటికి అదనంగా షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్ల కారణంగా ఉద్యోగులు అనారోగ్యం పాలు కావడంతో పాటు మృత్యువాత పడుతున్న కారణంగా బి.యల్.ఒ విధుల నుండి విముక్తి కల్పించాలని కోరుతూ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరపున అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు ఎం.డి.జాని పాషా మరియు బత్తుల.అంకమ్మరావులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కి, రాష్ట్ర ఎన్నికల అధికారికి,గ్రామ వార్డు సచివాలయాల శాఖ రాష్ట్ర కార్యదర్శికి మరియు రాష్ట్ర సంచాలకులకు వేరు వేరుగా వినతిపత్రాలు అందించామని తెలుపుతూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *