-రూ. 3 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణం
-త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి కందుల దుర్గేష్ ఆదేశం
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలు: రూ. 3 కోట్ల వ్యయంతో నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలోని కానూరు-ఉసులుమర్రు సిసి రోడ్డు పనులను మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం ప్రారంభించారు. రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన అనంతరం మంత్రి దుర్గేష్ స్వయంగా ప్రోక్లైన్ ను నడిపారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ నాణ్యతలో రాజీ పడకుండా త్వరితగతిన పనులు పూర్తి చేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. త్వరలోనే నిడదవోలు నియోజకవర్గంలోని ప్రధాన రోడ్లకు సరికొత్త రూపు రానుందని, ఎన్నో ఏళ్లుగా వాహనదారులు పడుతున్న కష్టాలకు చెక్ పడుతుందని మంత్రి దుర్గేష్ అన్నారు.
Prajavartha Online Telugu News