ప్రభుత్వ పథకాల సమర్థ అమలుకు Citizen e-KYC తప్పనిసరి

-ప్రజల్లో అవగాహన పెంచి, క్షేత్రస్థాయిలో అధికారులు వేగవంతం చేయాలి
-జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో, సమర్థవంతంగా అందాలనే లక్ష్యంతో తూర్పుగోదావరి జిల్లాలో Citizen e-KYC ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు.

ఈ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యంతో పాటు క్షేత్రస్థాయిలో అధికారుల బాధ్యతాయుతమైన చర్యలు కీలకమని తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,48,969 Citizen e-KYCలు ఉండగా, ఇప్పటివరకు 43,306 మాత్రమే పూర్తయ్యాయని, ఇంకా 1,05,663 (సుమారు 71 శాతం) e-KYCలు పెండింగ్‌లో ఉన్నాయని కలెక్టర్ వెల్లడించారు.

ముఖ్యంగా రాజమహేంద్రవరం, కోవ్వూరు డివిజన్ల పరిధిలోని పలు మండలాలు, మున్సిపాలిటీల్లో పెండెన్సీ అధికంగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, సంబంధిత అధికారులు తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో రాజమహేంద్రవరం అర్బన్, రాజమహేంద్రవరం రూరల్, కడియం, సీతానగరం, రంగంపేట తదితర ప్రాంతాల్లో e-KYC పెండెన్సీ 70 శాతం పైగా ఉన్నట్లు తెలిపారు. అలాగే కోవ్వూరు డివిజన్‌లో కోవ్వూరు అర్బన్, గోపాలపురం, ఉండ్రాజవరం, తాళ్లపూడి, దేవరపల్లి మండలాల్లో కూడా అధిక శాతం e-KYCలు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల ప్రభుత్వ పథకాల అమలుపై ప్రతికూల ప్రభావం ఉంటుందన్నారు.

ఈ నేపథ్యంలో ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. Citizen e-KYC అప్డేట్ చేయని పక్షంలో తల్లికి వందనం, రైతు భరోసా, ఆటో డ్రైవర్ సేవలో పథకాలు, రైస్ కార్డు సంబంధిత సేవలు, దీపం పథకం గ్యాస్ సబ్సిడీతో పాటు కుల, ఆదాయ తదితర ధృవీకరణ పత్రాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అదేవిధంగా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ విఫలమై ప్రభుత్వ పథకాల ధృవీకరణ ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం కూడా ఉందని స్పష్టం చేశారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది మరింత బాధ్యతతో పనిచేసి ప్రతి కుటుంబాన్ని ప్రత్యక్షంగా సంప్రదించి Citizen e-KYC ప్రాధాన్యతను వివరించాలని సూచించారు.

ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ సమీప గ్రామ లేదా వార్డు సచివాలయాలను సంప్రదించి వెంటనే Citizen e-KYC అప్డేట్ పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు.

జిల్లాలో e-KYC పెండెన్సీ వివరాలు (శాతం):

రాజమహేంద్రవరం డివిజన్ (పెండెన్సీ: 72%)
రాజమహేంద్రవరం అర్బన్ – 82.6% ,
రాజమహేంద్రవరం రూరల్ – 71.8% ,
రాజానగరం – 57.9% ,
సీతానగరం – 73.0% ,
కోరుకొండ – 62.5% ,
బిక్కవోలు – 63.6% ,
కడియం – 79.1% ,
రంగంపేట – 69.3% ,
అనపర్తి – 65.1% ,
గోకవరం – 58.9%.

కోవ్వూరు డివిజన్ (పెండెన్సీ: 69%)
దేవరపల్లి – 74.6% ,
ఉండ్రాజవరం – 75.7% ,
గోపాలపురం – 79.3% ,
నల్లజర్ల – 68.7% ,
కోవ్వూరు రూరల్ – 70.9% ,
తాళ్లపూడి – 76.3% ,
కోవ్వూరు అర్బన్ – 83.5% ,
చాగళ్ళు – 62.2% ,
నిడదవోలు అర్బన్ – 76.2% ,
నిడదవోలు రూరల్ – 50.4% ,
పెరవలి – 38.1% .

ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలుకు Citizen e-KYC కీలకమైన అంశమని, ప్రజల సహకారంతో పాటు క్షేత్రస్థాయిలో అధికారులు వేగవంతంగా చర్యలు తీసుకోవాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *