-జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల
-నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ… కలెక్టర్ కు పలువురు అందించిన విద్యాసామగ్రిని విద్యార్థులకు అందజేసిన కలెక్టర్
నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రద్ధతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జనవరి ఒకటిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ…జిల్లా కలెక్టర్ కు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు అందించిన విద్యాసామగ్రిని పేద విద్యార్థులకు కలెక్టర్ అందజేశారు. పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా విద్యార్థుల విద్యాభివృద్ధి, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, జిల్లాలోని పిల్లలకు నిఘంటువులు, నోట్ పుస్తకాలు తదితర విద్యా సామగ్రి, పండ్లు, స్వీట్లు.. పంపిణీ చేశారు.
ఈ క్రమంలో జనవరి 01వ తేదీన నగరంలోని ఆర్. కె. నగర్ లో గల జనహిత – వాత్సల్య అనాధాశ్రమంలో చదువుతున్న విద్యార్థులకు 250 విద్యాసామాగ్రి, స్వీట్స్, పండ్లు పంపిణీ చేశారు. అలాగే శుక్రవారం కావలి లో గల ఎస్ సి బాలికల హాస్టల్ విద్యార్థులకు కలెక్టర్ అందజేశారు.
జిల్లా కలెక్టర్ పంపిణీ చేసిన విద్యాసామాగ్రి, ఆహార పదార్థాలు :
లాంగ్ నోట్ పుస్తకాలు – 834, షార్ట్ నోట్ పుస్తకాలు – 368, పరీక్ష ప్యాడ్లు – 138, పెన్సిళ్లు – 180,
పెన్స్ – 795, పెన్–పెన్సిల్ కాంబో బాక్స్‌లు – 40 ప్యాకెట్లు, కలర్ క్రేయాన్లు – 10 ప్యాకెట్లు, నిఘంటువులు – 262, అట్లాస్‌లు – 9,
ఇంగ్లీష్ వ్యాకరణ పుస్తకాలు – 4,
వాల్మీకి రామాయణం పుస్తకాలు – 7 ..వీటితో పాటు
ఆపిల్స్ – 90, నారింజలు – 130
స్వీట్లు – 4 కిలోలు, కేక్ – 1 కిలో…ఆహార పదార్థాలను
కలెక్టర్ పంపిణీ చేసిన వాటిల్లో ఉన్నాయి.
విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి చదువుకు అవసరమైన పుస్తకాలు, లేఖన సామగ్రిని అందించడం ద్వారా వారి విద్యా ప్రగతికి తోడ్పాటు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News