అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతి- అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(AGC)లో నిర్మిస్తున్న ఐకానిక్ హైకోర్టు భవన సముదాయాల పనులలో భాగంగా చేపట్టిన బ్లాక్-3 కాంక్రీట్ పౌరింగ్ నిర్విరామంగా జరుగుతున్నాయి. 48 గంటలపాటు నిర్విరామంగా జరిగే కాంక్రీట్ పౌరింగ్ పనులను సైట్లో APCRDA కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్., ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆర్.గోపాల కృష్ణారెడ్డి శనివారం పూజలు చేసి ప్రారంభించారు. కాంక్రీట్ పౌరింగ్ పనుల సన్నాహాలను పరిశీలించి అధికారులు, సిబ్బందికి కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(AGC)లోని సూపర్ బ్లాక్-F లో 42.36 ఎకరాలలో 20,32,000 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాలో బేస్మెంట్ + గ్రౌండ్+ 7 ఫ్లోర్లలో హైకోర్టు నిర్మాణం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. గత నెలలో రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా.పొంగూరు నారాయణ హైకోర్టు భవనాల నిర్మాణ పనులకు సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ పనులను ప్రారంభించారని కమిషనర్ పేర్కొన్నారు. మంత్రివర్యుల వారి సూచనల మేరకు రాజధాని అమరావతిలో పనులను APCRDA అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్మాణ పనులలో పురోగతికై కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో CRDA హౌసింగ్& బిల్డింగ్స్(హౌసింగ్) విభాగ చీఫ్ ఇంజినీర్ P.V.K. భాస్కర్, కమ్యూనికేషన్స్ విభాగ డిప్యూటీ డైరెక్టర్& దక్షిణాసియా(SEA) ఇన్వెస్ట్మెంట్ ఇన్ఛార్జ్ ఎం.సిద్దార్థ, గుత్తేదారు, పీఎంసీ సంస్థల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News