కాళహస్తి, అన్నవరం దేవస్థానాల నుండి అమ్మవారికి చీర సారె…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం 7వరోజు అష్టమి తిదిలో దుర్గాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారికి కాళహస్తి శ్రీ కాళహస్తీశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇవో డి. పెద్దిరాజు, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వార్ల దేవస్థానం ఇవో ఇత్రినాథరావు సాంప్రదాయ బద్దంగా ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవికి పట్టువస్త్రాలు, సారె, పసుపు, కుంకుమలు, పూలు, పండ్లు సమర్పించారు. ముందుగా ఆలయ పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఇవో దర్భముళ్ల భ్రమరాంబ’లు వారికి ఘనంగా స్వాగతం పలికి, వారిచే ప్రత్యేక పూజలు జరిపి, దర్శనానంతరం అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదములు, ఆలయ వేదపండితులచే వేదాశ్వీరచనం అందచేశారు. ఇప్పటి వరకు విశాఖపట్నం దేవస్థాన ఇవో జ్యోతి మాధవి, కాళహస్తి దేవస్థానం ఇవో డి. పెద్దిరాజు, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వార్ల దేవస్థానం ఇవో ఇ.త్రినాథరావు’లు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ చేశారని ఆలయ ఇవో డి. భ్రమరాంబ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *