రాధా నగర్ లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ పేరు పెట్టాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాధా నగర్ లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ పేరు పెట్టాలని ఎన్.యస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ కోరుతున్నారు. శనివారం ఎన్.యస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ 90వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. పేపర్ భాయ్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎదిగిన డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ స్ఫూర్తిని పెంపొందించేందుకు భావి భారత యువతకు ఆయన గొప్ప తప్పదని తెలిచేసేలా ప్రస్తుత పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశంగా  చేర్చి దేశానికి, భావి భారత శాస్త్రవేత్తలను తయారు చేయడం వలన దేశానికి అబ్దుల్ కలాం ఆజాద్ కి  గౌరవప్రద ఘన నివాళులు అర్పించాలన్నారు. అబ్దుల్ కలాం ఆజాద్  ఒక వ్యక్తి కాదని, భారతదేశానికి రక్షణ కోసం అణుబాంబును, రాకెట్ సృష్టించిన గొప్ప శక్తివంతుడనీ అయన జీవితాన్ని, సేవలను భావి తరాలు స్ఫూర్తిగా తీసుకొనేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేయాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *