ఉల్లాస్ అక్షర ఆంధ్రా పరీక్షలను తనిఖీ చేసిన కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉల్లాస్ అక్షర ఆంధ్రా పరీక్షలను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదివారం తనిఖీ చేశారు. గుంటూరు పట్టణం కె.వి. పి కాలనీ దగ్గరలో గల లాల్ పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రంలో జరుగుతున్న పరీక్షలను తనిఖీ చేశారు. కేంద్రంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎండ వేడిమి కారణంగా అన్ని కేంద్రాల్లో తాగునీటి సదుపాయం ఉండాలని ఆదేశించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు వచ్చి పరీక్షలు రాయుటకు అనుగుణంగా తగు సూచనలు సలహాలు అందించాలని నిర్వాహకులకు ఆదేశించారు. ఈ పరీక్షలకు జిల్లాలో 90,426 మంది అభ్యర్థులు నమోదు అయ్యారు. జిల్లాలో 1485 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు తమకు అవకాశం ఉన్న సమయంలో వచ్చి పరీక్షలు రాసుకునే సదుపాయం ప్రభుత్వం కల్పించింది. పరీక్షను రెండు గంటల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షలు 150 మార్కులకు ఉంటుంది, అందులో 50 మార్కులు చదవడానికి, 50 మార్కులు రాయడానికి, 50 మార్కులు అంకెల పరిజ్ఞానంపై ఉంటుంది. ఒక్కో విభాగంలో 17 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత పొందినట్లు భావిస్తారు.

శత శాతం అక్షరాస్యత ధ్యేయం
జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో శత శాతం అక్షరాస్యత సాధించడం ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు అక్షరాస్యులు కావాలని తద్వారా కుటుంబాల్లో అక్షరాస్యత శాతం పెరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో వయోజన విద్యా డిప్యూటీ డైరక్టర్ ఆంజనేయులును, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *