నిస్వార్ధ సేవలకు చిరు సత్కారం… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలలు కన్నా ప్రజలవద్దకే పాలనను సమర్థవంతంగా నిర్వహిస్తున్న సచివాలయ సిబ్బందికి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ధన్యవాదాలు తెలియచేసారు. నియోజకవర్గం లోని 4వ డివిజన్ లోని గురుద్వార్ లో గురు సింగ్ సభా మరియు 4వ డివిజన్ ఇంచార్జి గల్ల పద్మావతిలు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన నిర్వహించిన సచివాలయ సిబంధికి చిరు సత్కారం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి దేవినేని అవినాష్ ముఖ్య అతిధిగా పాల్గొని సచివాలయ సిబంధిని సత్కారించారు. అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయాలనీ ముఖ్యమంత్రి  పిలుపు మేరకు ఏమి ఆశించ కుండా సేవ చేస్తున్నసచివాలయ సిబంధికి ఎలాంటి సత్కారం చేసినా చిన్నదే అని అన్నారు. కరోనా కష్టకాలం లో వారి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వారు చేసిన సేవల చూసి యావత్ దేశం అభినందించింది అని అన్నారు. వీరి సేవలు చూసి కొన్ని రాష్ట్రాలు సైతం సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టె ఆలోచనలో ఉన్నారు అని అన్నారు. జనగ్ మోహన్ రెడ్డి ముందు చూపు వారి పాలనాను చూసి దేశం మొత్తం అయన పథకాలను చూసి ఆయా రాష్ట్రాలలో ప్రవేశ పెట్టె లాగా అడుగులు వేస్తున్నాయి అన్ని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి  కలలు కన్నా ప్రజలవద్దకే పాలనను సమర్థవంతంగా నిర్వహిస్తున్న సచివాలయ సిబంధికి అవినాష్ ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రంలో మాజీ కార్పొరేటర్ కావటి దామోదర్, జేజే సింగ్, కన్వాల్ జిత్ సింగ్,గురుజిత్ సింగ్, హర్ మోహిందర్ సింగ్, కవాలిత్ సింగ్, బొడ్డు తరుణ్, బత్తుల ప్రసాద్ రెడ్డి,త్రినాథ్, శౌకత్, జేపీ, చందు, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, జయరాజు,వైసిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *