Breaking News

పాఠశాల ఫస్టు విమాన యానం చేయించిన ఉపాధ్యాయులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయనగరం జిల్లా చీపురుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో పాఠశాల ఫస్ట్ 581 మార్కులు సాధించినందుకు గాను A. హేమంత్ ప్రత్యేక విమానం ద్వారా విద్యా శాఖపట్నం నుంచి విజయవాడ వరకు ఆ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బయలాజికల్ అసిస్టెంట్ మిరియాల కృష్ణారావు తన సొంత ఖర్చులతోటి ఆ విద్యార్థిని విమానయానం చేయించారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మంచి మార్కులతో పాటు మంచి అనుభవాన్ని ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందానికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు.
ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తన సొంత ఖర్చుతో విద్యార్థిని విమానాన్ని ఎక్కించి మంచి అనుభవాన్ని ఇచ్చిన మిరియాల కృష్ణారావు కి ప్రత్యేక అభినందనలు. మిరియాల కృష్ణారావు కి మంచి మార్కులు సాధించిన హేమంత్ మంచి మార్కులు సాధనలో కృషి చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందానికి యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *