Breaking News

కాంగ్రెస్ పార్టీ టీవీకే (తమిళగ వెట్రీ కజగం) పార్టీకి మద్దతు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్న నరేంద్ర మోడీ..

-పొత్తుల పేరుతో మహారాష్ట్ర శివసేన షిండే, ఒడిస్సా నవీన్ పట్నాయక్, బీహార్ నితీష్ కుమార్ లకు వెన్నుపోటు పొడిచి వారిని ముఖ్యమంత్రి పదవులకు దూరం చేసింది బిజెపి కాదా..?
-వెన్నుపోటు, పొత్తులు, అధికార దాహం, అక్రమ పొత్తులు, మిత్రపక్షాలకు ద్రోహం, దురాశ అధికారకాంక్ష గురించి నరేంద్ర మోడీ మాట్లాడటం చూస్తుంటే “గురివింద గింజ తన నలుపెరగదంట” సామెత గుర్తొస్తుంది..
-ఎన్.ఎస్.యు.ఐ. స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నరేంద్ర మోడీని సామాన్య కార్యకర్త నుండి గుజరాత్ ముఖ్యమంత్రి చేసిన తన గురువు లాల్ కృష్ణ అద్వానీ (ఎల్కే అద్వానీ)ని ప్రధానమంత్రి కోసం వెన్నుపోటు పొడిచిన నరేంద్ర మోడీ వెన్నుపోటు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది..

పొత్తుల విషయానికొస్తే పొత్తులు పెట్టుకోవడం పొత్తు పెట్టుకున్న పార్టీని పాతరేయ్యడం బిజెపికి, నరేంద్ర మోడీకి వెన్నతో పెట్టిన విద్య అనీ, దానికి ప్రత్యక్ష నిదర్శనాలే మహారాష్ట్రలో శివసేన (షిండే) వర్గానితో పొత్తు పెట్టుకుని షిండే వర్గాన్ని పాతాళంలోకి తొక్కివేయటం, శాశ్వత మిత్రుడైన ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు వెన్నుపోటు పొడిచి అతని ముఖ్యమంత్రి పదవి నుండి దించి వేయడం, అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో పొత్తులో ఉండి అతనిని ముఖ్యమంత్రి పదవికి దూరం చేసి పార్టీని అదః పాతాళంలోకి తొక్కివేసింది మీ బిజెపి, నరేంద్ర మోడీ కాదా అని ప్రశ్నిస్తూ.. ?

బిజెపి దేశంలో తమ పార్టీ కార్యకర్తలను దేశంలోని రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమించి గవర్నర్ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని రాష్ట్రాల్లో సుపరిపాలన జరగకుండా ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలపై నీచ రాజకీయాలను చేస్తూ బిజెపి వ్యతిరేక ప్రభుత్వాలపై అసత్య ప్రచారాలతో అధికార దుర్వినియోగాలతో బ్రష్టు పట్టించ్చేందుకు ఎలాంటి దుర్మార్గపు చర్యలు చేయడానికైన వెనకాడబోని బిజెపి నరేంద్ర మోడీ లు విలువల గురించి పొత్తులు గురించి వెన్నుపోటు గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉన్నాయనీ..

మోడీ, అమిత్ షా లు తమ అధికారాలన్నీ దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని, మమతా బెనర్జీని ఓడకొట్టాలని దురుద్దేశంతో ఒక పథకం ప్రకారం నెలలు తరబడి దేశ శ్రేయస్సును పట్టించుకోకుండా ఆయా రాష్ట్రాల్లో మకాం వేసి మరి మతం పేరుతో కులం పేరుతో ప్రాంతాల పేరుతో అల్లర్లు అలజడలు సృష్టించి అధికార అహంతోను, కాంక్షతోను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఆయా రాష్ట్రాలలో ప్రత్యేక ఎన్నికల అధికారుల రూపంలో సొంత జోబు సంస్థలాగ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అధికారికంగా బిజెపి గుండాలుగా రిక్రూట్ చేసుకొని ఓటర్లను భయభ్రాంతులను చేస్తూ ఆయా రాష్ట్రాల్లో అక్రమ పద్ధతిలో రాజ్యాంగ విరుద్ధంగా అధికారంలోకి రాగలిగిందని..

కానీ దేశంలో మొన్న జరిగిన కేరళం, తమిళనాడు రాష్ట్రాలలో బిజెపి మోడీ అమిత్ షాల కుట్రలు సాగలేదని కేరళం, తమిళనాడు రాష్ట్ర ప్రజలు మోడీకి అమిత్ షాల నీచ రాజకీయ కుట్రలకు పరోక్షంగా చెంపపెట్టు కొట్టినట్టుగా బిజెపి కు వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమి పార్టీలను ఓడ కొట్టి ప్రజాస్వామ్య విలువలతో విజ్ఞత కలిగిన ప్రజలే ప్రత్యక్షంగా తమ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ కూటమి పార్టీలకు వేయడం జరిగిందని ఇది నిజమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనమని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *