-కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం
-సీఐఐ బిజినెస్ సమ్మిట్ కు హాజరు కానున్న ముఖ్యమంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న సీఎం ఉదయం 11.30 గంటలకు హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తోనూ ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించమన్నారు. మద్యాహ్నం 3 గంటలకు ప్రపంచబ్యాంకు ప్రతినిధులు సీఎంతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్ లో భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్ధిక సలహా మండలి చైర్మన్ ఎస్. మహేంద్రదేవ్ సహా నీతిఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. రేపు రాత్రికి ఢిల్లీలోనే సీఎం బస చేయనున్నారు.
Prajavartha Online Telugu News