Breaking News

గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన కొక్కిరిగడ్డ నీరజ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరానికి చెందిన కొక్కిరిగడ్డ నీరజ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుకు అర్హత సాధించాడు. గత ఫిబ్రవరి 2వ తేదీ హైదరాబాద్ లోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్లో 22 దేశాల నుంచి 2 వేల మంది కీ బోర్డు వాయిద్యకారులు ఏకకాలంలో ప్రదర్శన నిర్వ హించారు. ఈ ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడంతో ఈ ప్రదర్శనలో ప్రతిభ చాటిన 777 మంది విద్యార్థులకు గిన్నిస్ వరల్డ్ వ్యవస్థాపకుడు అగస్టిన్ దండంగి నుంచి జెరుబూబ్బెల్ గిన్నిస్ రికార్డు ధ్రువపత్రం అందుకున్నారు. నీరాజ్ తండ్రి కొక్కిరిగడ్డ స్టాలిన్ న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా నీరజ్ ను పలువురు క్రీడాకారులు, న్యాయవాదులు అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *