అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశా రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా సోమవారం అమరావతి అసెంబ్లీ కమిటీ హాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు.ఈసందర్భంగా బాలకృష్ణ మాచార్యులు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు నిబద్ధతతో కూడిన వ్యక్తిత్వం కలిగిన మనిషని ఆయన త్యాగనిరతిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శులు యం.విజయ రాజు,కె.రాజకూమార్,పలువురు సహాయ కార్యదర్శులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News