Breaking News

జనసేన కేంద్ర కార్యాలయంలో రెండో రోజు జనవాణి – ప్రజల సమస్యల స్వీకరణ

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో కూడా పలువురు ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, జీడీ నెల్లూరు ఇంచార్జ్ పొన్న యుగంధర్, పుంగనూరు ఇంచార్జ్ సీరివేలు గంగాధర్, లీగల్ సెల్ నుంచి కంచి శ్యామల తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *