గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని అన్ని ప్రధాన డ్రైన్లలో మరియు అంతర్గత రోడ్లలోని డ్రైన్లలోని సిల్ట్ తొలగింపు పనులు ఈ నెలాఖరు నాటికి నూరు శాతం పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రానున్న వర్షాకాలం లోపే నగరంలోని అన్ని అవుట్ ఫాల్ డ్రైన్లలో పూడికతీత పనులు నూరు శాతం పిన్ పాయింట్ గా పూర్తి చేయాలని, నగరంలో ఇంకా కొన్ని డివిజన్లలో సిల్ట్ తొలగింపు పనులు ప్రారంభం కాలేదని, సదరు ప్రాంతాలలో వెంటనే పనులను ప్రారంభించాలని, అలాగే సిల్ట్ తొలగింపు పనులు ప్రాంభమైన డివిజన్లలో కాలువల్లో సిల్ట్ తీసిన అనంతరం, వెంటనే సదరు ప్రాంతం నుండి సిల్ట్ ను తొలగించాలని అధికారులను ఆదేశించారు. సిల్ట్ తొలగింపు పనులు త్వరితగతిన పూర్తి చేయుటకు అదనపు వర్క్స్ ను ఏర్పాటు చేసుకొని పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో త్రాగు నీటి సరఫరా జరుగు సమయంలో కార్యదర్శులు నూరు శాతం తప్పనిసరిగా శ్యాంపిల్స్ సేకరించాలని, ఏఈలు కూడా త్రాగునీటి సరఫరా సమయంలో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. త్రాగునీటి శాంపిల్స్ సేకరించని వారి పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులను అగ్రిమెంట్ స్టేజ్, టెక్నికల్ శాంక్షన్, అగ్రిమెంట్, డిజిటల్ ఎం.బుక్ లు పూర్తి చేసి శనివారం లోపు నిధి పోర్టల్లో అప్ లోడ్ చేయాలన్నారు. వార్డ్ లలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఇంజినీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉండాలని ఆదేశించారు.
సమావేశంలో ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, ఈఈలు సుందరరామిరెడ్డి, వేణు, విష్ణు, డిఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News