విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా లో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అమలచేస్తున్న మిషన్ వాత్సల్య స్కీమ్ పై జాయింట్ కలెక్టర్ శ్రీమతి యస్ ఇలాక్కియా సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ సాధికారిత అధికారి శ్రీమతి షేక్ రుక్సానా సుల్తాన బేగం జిల్లాలో మిషన్ వాత్సల్య స్కీం అమలుచేస్తున్న కార్యక్రమాలు గురించి వివరించారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి యమ్ రాజేశ్వరరావు 2025-26 సంవత్సరంలో నిర్వహించిన స్కీం కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు.
జాయింట్ కలెక్టర్ ఈ క్రింది కార్యక్రమాలు అమలు అయ్యేవిధంగా ఆదేశించారు.
1. నిరాశ్రాయులు కలిగిన బాలలకు ఆరఫాన్ సర్టిఫికెట్ కల్పించాలి
2. ఫోస్టర్ కేర్ అమలు చేయాలి
3. బాల్య వివాహలలు నిలుపుదలలో వివిధ శాఖలను భాగ్యస్వాములు చెయ్యాలి
4. జిల్లా బాలికల కొరకు షెల్టర్ హోం ఏర్పాటు చేయాలి
5. సిబ్బంది అందరు సమాన్యంతో పని చెయ్యాలిని సూచించారు.
ఈ కార్యక్రమం లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,సీడీపీఓ లు,జిల్లా బాలల పరిరక్షణ విభాగం, డీపీవో, బాలల సంరక్షణ కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
16 నెలలు… 16కు పైగా విజయాలు…
-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …
Prajavartha Online Telugu News