-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయoకు వచ్చు భక్తుల సౌకర్యం కొరకు రాక పోకలు సజావుగా ఉండేలా ట్రాఫిక్ సమస్య తీర్చుట కొరకు మాస్టర్ ప్లాన్ లో భాగంగా తిరుచానూరు రోడ్డు విస్తరణ, పార్కింగ్ కు సంబంధించిన పనుల పై టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బరాయుడు, సి వి ఎస్ ఓ మురళి కృష్ణ తో కలిసి తుడా, టిటిడి వారు తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్.. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలు, సాధారణ రోజుల్లో కూడా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఎక్కువ శాతం భక్తులు దర్శించుకుంటారని తెలిపారు. అందులో భాగంగానే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయoకు వచ్చు భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండేందుకు ఆలయ పరిసరాలలో రద్దీని తగ్గించేందుకు భక్తులకు మెరుగైన దర్శన అనుభూతి కలిగించేలా రోడ్డు నిర్మాణo, పార్కింగ్ పనులను చేపట్టాలని తెలిపారు. రోడ్డు నిర్మాణం, పార్కింగ్ పనులు చాలా ముఖ్యమైనవి అనీ ప్రణాళిక బద్ధంగా పనులు పూర్తి కావాలన్నారు. టిటిడి జేఈవో, తుడా సిపిఓ రోడ్డు నిర్మాణం, పార్కింగ్ కు సంబంధించి సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ ప్లాన్ గురించి జిల్లా కలెక్టర్ కు విపులంగా వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఇంచార్జీ కమిషనర్ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, అడిషనల్ ఎస్పీ రవి మనోహరచారి, తిరుపతి ఆర్టీవో రామ్మోహన్, ఏ డి సర్వేయర్ అరుణ్ కుమార్, సూపర్డెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, ఆర్ అండ్ బి ఎస్ ఈ సుధాకర్ నాయక్, తుడా ఎస్ఈ రవీంద్ర, తుడా సి పి ఓ దేవి , టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News