తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సమేతంగా నేడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తన మనవరాలి కేశకండన కార్యక్రమం అనంతరం మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ద్వారా సామాన్య భక్తుడిలా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేయగా, దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, టీటీడీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News