Breaking News

అంగన్వాడి, విద్యా వ్యవస్థ తీరు తెన్నులను పరిశీలించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 23వ తేదీ శనివారం మండలాల్లో విస్తృతంగా పర్యటించి అంగన్వాడి, విద్యా వ్యవస్థ తీరు తెన్నులను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి మండల ప్రత్యేక అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలనపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు మండలాల్లో విస్తృతంగా పర్యటించి అంగన్వాడి కేంద్రాలను సందర్శించాలన్నారు.అక్కడ ఉన్న వసతులను ముఖ్యంగా మంచినీరు, మరుగుదొడ్ల వసతులు ఉన్నాయా లేదా వాటి స్థితిగతులను పరిశీలించి వివరాలు తెలియజేయాలన్నారు. అంతేకాకుండా అంగన్వాడి కేంద్రాలకు వచ్చే పిల్లల బరువు ఎలా ఉంది గమనించి నివేదిక అందజేయాలన్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసి కార్యక్రమం కింద విద్యా వాలంటీర్ల ద్వారా ఎంత మేరకు విద్యాబోధన జరుగుతుందో పరిశీలించాలన్నారు. అంతేకాకుండా 9వ తరగతి నుండి 10 వ తరగతికి లో ప్రవేశించే విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటున్నారో అధ్యయనం చేయాలన్నారు. వీటన్నిటిపై సమగ్ర నివేదిక అందజేయాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *