Breaking News

ఓఎన్జీసీ, రాజమండ్రి అసెట్ చే కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు 22 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు మరియు 44 ఆక్సిజన్ సిలిండర్లు విరాళం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :అమిత్ నారాయణ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ONGC రాజమండ్రి అసెట్ తో పాటు రావు మహమ్మద్ నవీద్, హెడ్ హెమో’ Mr. సుదీప్, EE (Res), Mr , రాజేష్ కలేకూరి GM (HR) మరియు Mr. వివేక్ మూర్తి, HRE ఎగ్జిక్యూటివ్ కూడిన బృందం 22 ఆక్సిజన్ కాన్సెంటేటర్లను మరియు 22 B & D రకం ! లీటర్లు మరియు 47 లీటర్ల సామర్థ్యంతో కూడిన ఆక్సిజన్ సిలిండర్లను సామాజికార్థికాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయములో కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేయడానికి కృష్ణాజిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ జె.నివాస్ కు అందజేశారు. భారతదేశం కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతున్నందున, కోపిడ్ ఇన్ ఫెక్షన్ల వేగవంతమైన పెరుగుదల వలన ఆక్సిజనకు డిమాండ్ పెరగడానికి దారితీసింది. ONGC రాజమండ్రి అసెట్ స్థానిక వైద్య పరిపాలన పై భారాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యముతో ఆంధ్రప్రదేశ్ లోని కార్యాచరణ ప్రాంతాలలో మొత్తం 200 ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్లు మరియు 200 ఆక్సిజన్ సిలిండర్లు మొత్తం 400 ఆక్సిజన్ సిలిండర్లను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది. క్రితం నెల తూర్పుగోదావరి జిల్లాలోని ఆసుపత్రులకు పంపిణీ చేసేందుకు ఓఎన్జీసీ 40 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, 80 ఆక్సిజన్ సిలిండర్లను ఇప్పటికే అందజేసింది. ఈ సందర్భంగా విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయములో శ్రీ అమిత్ నారాయణ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ – అసెట్ మేనేజర్ మాట్లాడుతూ, సమాజ శ్రేయస్సు పట్ల ONGC నిబద్ధతను పునరుద్ఘాటించారు మరియు కోవిడ్ -19 మహమ్మారి సమయంలో వివిధ జిల్లా అధికారులకు అందించిన సహాయాన్ని తెలిపారు. అనంతరం కృష్ణాజిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ జె.నివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పౌరులకు ఎంతో అవసరమైన విరాళం అందించిన ONGCకి తన కృతజ్ఞతలు తెలిపారు. ఓఎన్జీసీ, రాజమండ్రి అసెట్ యొక్క కృషిని ఎంతో మెచ్చుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *