గ్రంధాలయ వారోత్సవాల్లో చిత్ర లేఖనం పోటీలు…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా జూనియర్, సీనియర్ విభాగంలో పిల్ల లకు చిత్ర లేఖనం పోటీలు నిర్వహించడం జరిగిందని లైబ్రరీయన్ జీ.వి.విఎన్.త్రినాధ్ తెలిపారు. గురువారం ఉదయం 54వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా కొవ్వూరు ప్రధమ శ్రేణి జిల్లా శాఖా గ్రంధాలయంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా త్రినాధ్ మాట్లాడుతూ, దేశభక్తి పట్ల పిల్లల్లో ఆసక్తి పెంచేందుకు చిత్ర లేఖనం పోటీలు నిర్వహించామన్నారు. పాఠశాల విద్యార్ధులకు జూనియర్ కళాశాల విద్యార్ధులకు జూనియర్ విభాగంలో “మీకు నచ్చిన జాతీయ చిహ్నం” , సీనియర్ విభాగంలో “మీకు నచ్చిన జాతీయ నాయకులు” అంశంపై చిత్రలేఖనం పోటీలను నిర్వహించామన్నారు. ఈ పోటీలలో వివిధ పాఠశాల లు, జూనియర్ కాలేజీ విద్యార్థులు సుమారు 210 మంది పైగా విద్యార్థిని, విద్యార్ధులు ఈ పోటీలో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో , ఉపాధ్యయురాలు బి.ప్రమీల, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *