Breaking News

త్వరలో గుంటూరు నగరానికి 200 ఈ -ఆటోలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
త్వరలో గుంటూరు నగరానికి 200 ఈ -ఆటోలు రానున్నాయని, వాటి ద్వారా డోర్ టు డోర్ చెత్త సేకరణ నూరు శాతం పూర్తి చేసేలా అధికారులు ప్రణాలికలు సిద్దం చేయాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ టాస్క్ ఫోర్స్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ పై విభాగాదిపతులతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్సు సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో డోర్ టు డోర్ చెత్త సేకరణకు మరియు పారిశుధ్య పనులు నిర్వహించడానికి ఈ-ఆటోలు స్వీపింగ్ మిషన్లు అందుబాటులోకి రానున్నాయని, వాటిలో ఇప్పటికే 25 ఈ-ఆటోలు, 6 స్వీపింగ్ మిషన్లు నగరానికి వచ్చాయన్నారు. గౌరవ ముఖ్యమంత్రివర్యులు నార చంద్రబాబు నాయుడు గారు రేపు గుడివాడలో జరగనున్న కార్యక్రమంలో ఈ- ఆటోలను ప్రారంభించనున్నారని, మన 25 ఆటోలను 6 స్వీపింగ్ మిషన్లను కూడా కలెక్టరేట్ లో ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు ప్రారంభించనున్నారని తెలిపారు. త్వరలోనే మిగిలిన 200 ఈ-ఆటోలు నగరానికి రానున్నాయని, వాటి ద్వారా ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు డోర్ టు డోర్ చెత్త సేకరణ నూరు శాతం నిర్వహించాలన్నారు. అంతేకాక వాటిలో 6 స్వీపింగ్ మిషన్ల ద్వారా నైట్ శానిటేషన్ సమయంలో నగరంలోని ప్రధాన రహదారుల్లో స్వీపింగ్ పూర్తి చేసెలా ప్రణాలికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాక త్వరలో నగరానికి రానున్న 200 ఈ ఆటోలను నగరంలోని అన్ని డివిజన్లలో వినియోగించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని టాస్క్ ఫోర్సు అధికారులను ఆదేశించారు.
సమావేశంలో అదనపు కమిషనర్ ఐ. కిషోర్, డిప్యూటీ కమిషనర్ సి.హెచ్ శ్రీనివాస్, యస్.ఈ సుందర్రామి రెడ్డి, డి.సి.పి సురాజ్ కుమార్, యం.హెచ్.ఓ డాక్టర్ సురేష్, ఏ.డి.హెచ్ శాంతి, యస్.యస్ లు యం.ఐజాక్, సాంబయ్య, సోమశేఖర్, ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *