Breaking News

సర్ లో సమస్యలేమైనా ఉంటే తమ ద్రుష్టికి తీసుకురావాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)కు సంబంధించి గడువు ఈ నెల 24 వరకు పెంచిననందున సర్ లో సమస్యలేమైనా ఉంటే తమ ద్రుష్టికి తీసుకురావాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ తెలిపారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కు సంబంధించి నగరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, బి.యల్.ఓలు ఇప్పటికే నగరంలో ఓటర్లకు ఎన్యుమరేషణ్ ఫారాలను అందజేయుట మరియు వాటి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యిందని, నగరంలో సర్ ప్రక్రియ నూరు శాతం పూర్తైయ్యందన్నారు. ప్రస్తుతం గుంటూరు నగరంలో జరుగుతున్న సర్ ప్రక్రియను నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది, బి.యల్.ఓ లు ఎటువంటి తప్పులు లేకుండా ట్రాన్స్ఫరెంట్ చేస్తున్నారని తెలియచేశారు. 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రస్తుత ఓటర్ల జాబితాతో క్షుణ్ణంగా పరిశీలించి మ్యాపింగ్ చేస్తున్నారని, సర్ ప్రక్రియకు గడువును ఈ నెల 24 వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం పోడిగించినందున రాజకీయ పార్టీల ప్రతినిధులకు మ్యాపింగ్ లో, ఏ.యస్.డి (అబ్సెంట్, షిఫ్టింగ్, డెత్, డూప్లికేట్)లో ఏమైనా సందేహాలు లేదా తప్పులు ఉన్నట్లు గుర్తించినట్లైతే తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే వాటిని పరిష్కరిస్తామని తెలియచేశారు. రాజీయ పార్టీల ప్రతినిధులు అన్ మ్యాపింగ్ వాటి పై ద్రుష్టి సారించి, వాటి మ్యాపింగ్ నకు సహకరించాలని కోరారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 31 మొదటి డ్రాఫ్ట్ పబ్లికేషణ్ ఉంటుందని తెలియచేశారు. ఈ సర్ కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కలిగించుటకు గుంటూరు తూర్పు మరియు పశ్చిమ నియోజకవర్గాలలో ప్రత్యేకంగా ఆటోలను ఏర్పాటు చేసి ప్రచారం చేయించుటయే కాక డివిజన్లలో హెల్ప్ డెస్క్ లను కూడా ఏర్పాటు చేశామన్నారు. నగరంలో సర్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయుటకు రాజకీయ పార్టీలు వారు వారి బి.యల్.ఏ తో ఎంతగానో సహకరించారని, వారి సహకారం వలెనే సర్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయుట జరిగిందన్నారు.
సమావేశం నందు పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ, అదనపు కమిషనర్ ఐ.కిషోర్, వెస్ట్ ఏఈఆర్ఓ సిహెచ్ శ్రీనివాస్, ఈస్ట్ ఏఈఆర్ఓ సాంబశివరావు,డిటిలు నాగమల్లేశ్వరావు, సుధా కిరణ్మయి, రాజకీయ పార్టీల ప్రతినిధులు టిడిపి ఓంకార్, సతీష్, శ్రీనివాస్, బిజేపి నారాయణ రెడ్డి, కుమార్, వైస్సార్సీపీ మహేష్ రెడ్డి, కిషోర్ బాబు, ఆమాద్మి సేవ కుమార్, బియస్పి వాసు, జనసేన త్రినాద్, కాంగ్రెస్ షేక్ జానీ బాషా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *