Breaking News

వాహనాల వివరాలను నిర్దేశిత ఫార్మేట్ లో సిద్దం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ వెహికిల్ షెడ్ లో వాహనాలన్నీ రన్నింగ్ లో ఉండాల్సిందేనని, వాహనాల వివరాలను నిర్దేశిత ఫార్మేట్ లో సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ కెవిపి కాలనీలోని జిఎంసి వెహికిల్ షెడ్ ని, వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న గార్బేజ్ ట్రాన్సఫర్ స్టేషన్లు (జిటిఎస్) నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పరిశుభ్రతలో చెత్త తరలింపు వాహనాలు ఎంతో కీలకమని, ప్రతి వాహనం నిర్వహణ ఖర్చుతో కూడుకున్నందున ఏ ఒక్క వాహనం రన్నింగ్ లో లేకుండా షెడ్ లో ఉండడానికి వీలు లేదన్నారు. వాహనాల వివరాలతో రిపోర్ట్ కావాలన్నారు. నూతనంగా అందుబాటులోకి తెచ్చిన స్వీపింగ్ అండ్ స్క్రాప్ పికింగ్ మెషిన్, ఉడ్ చిపింగ్ మెషిన్, డోర్ టు డోర్ కలెక్షన్ ఈ-ఆటోల పనితీరుని పరిశీలించి, వాటిని శనివారం ప్రారంభానికి సిద్దం చేయాలని ఆదేశించారు. వినియోగంలో లేని ప్లాస్టిక్ టు ఫ్యూయల్ స్టేషన్ ని మళ్లీ రన్నింగ్ చేయడానికి సంబందిత కాంట్రాక్ట్ ఏజన్సీ సిబ్బందిని పిలిపించాలని ఎస్ఈని ఆదేశించారు. షెడ్ లో పాత వాహనాలు, వస్తువులను స్క్రాప్ టెండర్ ద్వారా వేలం నిర్వహించాలన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో జిటిఎస్ కోసం ప్రతిపాదిత స్థలాలను పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి, సైట్ ల్లో మార్కింగ్ చేసి, ఇంజినీరింగ్ అధికారులకు అప్పగించాలని ఆదేశించారు.
పర్యటనలో సిటీ ప్లానర్ రాంబాబు, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, డిసిపి సూరజ్ కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, డిఈఈ సతీష్ కుమార్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *