Breaking News

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక & పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ టూక్ అల్ మర్రీకి ఘన స్వాగతం

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం, గన్నవరం వద్ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) గౌరవ ఆర్థిక & పర్యాటక శాఖ మంత్రి హిజ్ ఎక్సలెన్సీ అబ్దుల్లా బిన్ టూక్ అల్ మర్రీ గారికి సోమవారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గుడివాడ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) జి. బాల సుబ్రహ్మణ్యం గారు విమానాశ్రయంలో మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి, రాష్ట్ర ప్రభుత్వ తరఫున స్వాగతం తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులు ప్రోటోకాల్ ప్రకారం స్వాగత కార్యక్రమాలను నిర్వహించి, గౌరవ అతిథికి అవసరమైన ఏర్పాట్లు కల్పించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు, విమానాశ్రయ అధికారులు, ప్రోటోకాల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *