Breaking News

డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు ఆశీస్సులతో సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్లో పైపుల రోడ్డు సెంటర్ ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద ఈరోజు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అన్నదాన కార్యక్రమం 380 మందికి పెట్టడం జరిగింది. గత మూడు సంవత్సరాలుగా మేము చేస్తున్న ఈ అన్నదాన కార్యక్రమం నిరంతరం ఎంతో గొప్ప మనసు ఉన్న మహానుభావులందరూ మా ట్రస్టులో మేమున్నాము అంటూ ముందుకు వచ్చి డొక్కా సీతమ్మ ట్రస్టు మీది కాదు మనది అని ఎంతో సహృదయతో సహాయం చేస్తూ అందరం కలిసి ఈ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ను నడిపిస్తున్నాము. నెలలో మూడు నాలుగు సార్లు పెట్టే ఈ అన్నదాన కార్యక్రమం వేరువేరు ప్రాంతాల వాళ్ళమైన అందరం ఒకటిగా కలిసి చేస్తున్నాము. నేను ఈరోజు అన్నదానం పెడుతున్నాను అని ఒక మాట చెప్పగానే ముందుకు వచ్చి నడిపిస్తున్న మా డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ లోని ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అన్నదాన కార్యక్రమం నిత్యం జరగాలని మేము చేసే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని కోరుకుంటున్న డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు అవుటుపల్లి విజయ కుమారి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *