-సెల్ఫీ/గ్రూప్ రీల్లకు ఆహ్వానం – జూలై 29 వరకు ఎంట్రీలు – టాప్-5 విజేతలకు ప్రత్యేక బహుమతులు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ గర్వకారణమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు యువతలో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు 30 సెకన్ల రీల్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలో సెల్ఫీ రీల్ లేదా గ్రూప్ రీల్ రూపంలో పాల్గొనే అవకాశం కల్పించారు.
పోటీలో పాల్గొనదలిచిన వారు “What ASR International Airport Means to You” అనే అంశంపై 30 సెకన్ల నిడివి గల సెల్ఫీ లేదా గ్రూప్ రీల్‌ను రూపొందించి తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేయాలి. అనంతరం @APOfficialNews ను ట్యాగ్ చేయడంతో పాటు #ASRInternationalAirport, #UttarandhraKalalakuRekkalu హ్యాష్‌ట్యాగ్‌లను తప్పనిసరిగా ఉపయోగించాలి.
పోటీలో వచ్చిన ఎంట్రీలను సృజనాత్మకత, ప్రజల్లో చేరిక, ప్రేక్షకుల స్పందన, సందేశ ప్రభావం వంటి ప్రమాణాల ఆధారంగా పరిశీలించి టాప్-5 విజేతలను ఎంపిక చేసి ప్రత్యేక బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఈ పోటీలో పాల్గొనేందుకు జూలై 29, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. యువత, విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా వినియోగదారులు అధిక సంఖ్యలో పాల్గొని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై తమ అభిప్రాయాలను ప్రపంచానికి తెలియజేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
“మీ స్వరం… మీ కథ… మీ సృజనాత్మకత… ఆంధ్రప్రదేశ్ గర్వం” అనే సందేశంతో నిర్వహిస్తున్న ఈ పోటీలో పాల్గొని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పట్ల తమ అనుబంధాన్ని చాటడంతో పాటు ఆకర్షణీయమైన బహుమతులను గెలుచుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
Prajavartha Online Telugu News