Breaking News

“ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త” లక్ష్య సాధన

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న “వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్” లక్ష్యానికి అనుగుణంగా, మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల (SHGs) మహిళలను సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో రూపొందించిన ప్రాసెసింగ్ & ప్యాకేజింగ్ సెంటర్ల స్థాపన ప్రతిపాదనపై పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ని ఈరోజు వారి కార్యాలయంలో Buy Desi ప్రతినిధులు మరియు MEPMA ఆంధ్రప్రదేశ్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి వివరించారు. ఈ సమావేశంలో MEPMA నెల్లూరు ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు వారి బృందం, Buy Desi ప్రతినిధులు హర్ష రెడ్డి, కార్తీక్ పత్తిపాటి, షణ్మిత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా Buy Desi ప్రతినిధులు, SHG మహిళలు కేవలం ఉత్పత్తులు తయారు చేసే స్థాయిలో కాకుండా ప్రాసెసింగ్, బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ మరియు మార్కెట్ లింకేజీల ద్వారా స్వయం ఉపాధి పారిశ్రామికవేత్తలుగా ఎదిగే విధానాన్ని మంత్రికి సమగ్రంగా వివరించారు. ఈ నమూనా ద్వారా SWAYAM బ్రాండ్ కింద నాణ్యమైన ఉత్పత్తులను రాష్ట్రవ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా మార్కెట్ చేయడంతో పాటు, మహిళలకు స్థిరమైన ఆదాయం, రైతులకు మెరుగైన ధరలు, స్థానిక ఉత్పత్తులకు విలువ ఆధారిత మార్కెట్‌ను కల్పించవచ్చని వివరించారు. అదేవిధంగా, పైలట్ ప్రాజెక్టుగా నెల్లూరు, గుంటూరు మరియు పార్వతీపురం మన్యం జిల్లాల్లో ప్రాసెసింగ్ & ప్యాకేజింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించే కార్యాచరణను కూడా వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మహిళా సాధికారత, స్థానిక ఉపాధి, విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు, గ్రామీణ ఆర్థికాభివృద్ధి మరియు “ఆత్మనిర్భర్ ఆంధ్రప్రదేశ్” లక్ష్యాలకు బలమైన తోడ్పాటు అందుతుందని ప్రతిపాదనలో పేర్కొన్నారు.
ప్రతిపాదనలోని అంశాలను మంత్రి నారాయణ ఆసక్తిగా పరిశీలించి, SHG మహిళల ఆదాయాన్ని పెంచే విధంగా మరియు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న ఈ నమూనాపై అధికారులతో కలిసి సానుకూలంగా చర్చించారు. ఈ సమావేశం రాష్ట్రంలో మహిళల ఆర్థిక సాధికారత, గ్రామీణ పారిశ్రామిక అభివృద్ధి మరియు “ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త” లక్ష్య సాధన దిశగా ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *