Breaking News

అత్యంత సంబరంగా ముగ్గుల పోటీలు

-పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు
-విజేతలకు ఈ నెల 29 న ఫైనల్ పోటీలు
-ఫైనల్ లో గెలుపొందిన వారికి ఆగస్టు 1న ఎయిర్పోర్ట్ వద్ద బహుమతులు

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు భోగాపురం ఎయిర్పోర్ట్ అనే థీమ్ లో భాగంగా సోమవారం విశాఖపట్నం జిల్లా పరిధిలో రంగవల్లుల పోటీలు అత్యంత వైభవంగా, ఆడంబరంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ సచివాలయాలు/ప్రాంతాల్లో విశాఖ నగర పాలక పరిధిలోని అన్ని జోన్ల లో ఉత్సాహంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ పోటీలను విజయవంతం చేశారు. గ్రామీణ స్థాయి లో డి.ఆర్.డి.ఈ, పట్టణ ప్రాంతం లో యు.సి.డి శాఖలు ఈ పోటీలను నిర్వహించాయి.
​ఈ ముగ్గుల పోటీలలో ప్రతిభ కనబరిచిన ప్రతి జోన్ లో ముగ్గుర్ని విజేతలుగా ప్రకటించారు. విజేతలైన వారికి ఈ నెల 29 న ఫైనల్ పోటీలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఫైనల్ లో ఎంపికైన విజేతలకు ఆగస్టు 1న ప్రధాని మోదీ ప్రారంభించనున్న అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వేదిక వద్ద బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాలలో జోనల్ కమిషనర్లు,Mpdo లు,స్తానిక అధికారులు, స్తానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *