Breaking News

భగవాన్ రామదూత స్వామిని దర్శించుకున్న ” తెలుగు శక్తి ” బి.వి.రామ్

-ప్రపంచంలో యుద్ధాలు నిలిచిపోయి శాంతి నెలకొనాలని ఆకాంక్ష
-ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరింతగా ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలి

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ రామదూత స్వామివారు 43వ అవధూతగా, దత్తాత్రేయ పరంపరలో విశ్వశక్తి స్వరూపంగా గుర్తింపు పొందారు ఆయనను తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నం బిఎంఆర్ సార్థ కన్వెన్షన్స్, మన్నెగూడ, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర హైదరాబాద్ లో వేంచేసి ఉన్న రామ దూత స్వామి ని గురువారం మధ్యాహ్నం తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్, భార్య రాధిక కూతురు దన్వి తో వినపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం బి.వి.రామ్ మాట్లాడుతూ.. ఆయనను భక్తులు దత్తాత్రేయ అవతారంగా మరియు హనుమంతుని స్వరూపంగా భావిస్తారు. ఇరాన్, అమెరికా/ఇజ్రాయిల్ గల్ఫ్ దేశాలతో పాటు రష్యా, ఉక్రైన్ మధ్య యుద్ధాలు సహా.. ప్రపంచంలో అనేక ప్రాంతాలలో యుద్ధాలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా ఆ భారం సామాన్య ప్రజల పైన పడుతోందని, అనేకమంది ప్రాణాలు పోగొట్టుకోవడం లేదా గాయపడుతున్నారన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల బాల్యం ప్రశ్నార్ధకంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులలో తక్షణమే యుద్ధాలు నిలిచిపోయి శాంతి పరిస్థితులు ఏర్పడాలని స్వామీజీ వద్ద కోరుకున్నానని తెలిపారు. అదే విధంగా తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రభుత్వం మరింత సానుకూలంగా స్పందించి మన ప్రాంత అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా రామధూత స్వామిని.. సామాన్య ప్రజలతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇతర రంగాల ప్రముఖులు దర్శించుకుని ఆశీస్సులు పొందుతుంటారని బి.వి.రామ్ తెలిపారు. లోక కళ్యాణార్థం పాటు పడుతున్న రామధూత స్వామి లాంటి వారి వల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు.

బి.వి.రామ్ కు భగవాన్ శ్రీ శ్రీ రామధూత స్వామిజి ఆశీస్సులు
హైదరాబాద్ లో భగవాన్ శ్రీ శ్రీ రామధూత స్వామిజి ఆశీస్సులు గురువారం మధ్యాహ్నం తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ తీసుకున్నారు. అనంతరం భగవాన్ శ్రీ శ్రీ రామధూత స్వామిజి త్వరలో ప్రజా నాయకుడు గా ఎదుగుదల ఉంటుందని బి.వి.రామ్ కు స్వామి జి ఆశీర్వాదం ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *