Breaking News

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం విజయవాడ లోని ఆంధ్రరత్న భవన్ నందు రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కామన ప్రభాకరరావు మాట్లాడుతూ రాష్ట్రము లోని కిసాన్ కాంగ్రెస్ విభాగం ను పటిష్టం చేయడానికి తీసుకోవలసిన చర్యలు గురించి మాట్లాడినారు. ఈ సమావేశం లో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కమిటీ చేసిన కార్యక్రమంలపై సమీక్ష సమావేశం నిర్వహించినారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితుల పై తీవ్రంగా చర్చించి నారు. ఆంధ్ర ప్రదేశ్ లో వ్యవసాయము నకు తీవ్రమైన ముప్పు ఏర్పడినదని, దీనివల్ల గణనీయమైన వర్ష పాత లోటు, కరువు ఏర్పడి వరి, పత్తి వంటి పంటలపై తీవ్ర ప్రభావము చూపు తాయని, ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం తో రైతాంగం తీవ్రం గా నష్టపోతూ న్నారని కొన్ని ప్రాంతాలలో క్రాప్ హాలిడే ప్రకటిస్తామని రైతు లు ప్రకటించే అవకాశం ఉందని కామన పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ పంటలు అనగా కంది పప్పు, మినుములు, చిరుధాన్యం లు వంటి తక్కువ తేమ అవసరం అయ్యే పంటలను ప్రోత్సహించి, జలవనరులను నిర్వహణ ను మెరుగు పరచడం, బోర్ వెల్ ఆధారిత రక్షణాత్మక నీటి పారుదలకు ప్రాధాన్యమివ్వాలని, సహజ వ్యవసాయ పద్దతులను సేంద్రియ ఎరువులను వినియోగించేవాటికి ఇన్ ఫుట్ సబ్సిడీలు మరియు ప్రత్యామ్నాయ విత్తనాలు తక్షణం ప్రభుత్వం ఇవ్వాలని, అన్ని జిల్లాలోని రైతులకు ఉచిత ఇన్సూరెన్సు పథకం అమలు చేసి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని సమావేశం తీర్మానించింది.

పశుగ్రాసం మరియు సాగునీటి నిమిత్తం ముఖ్యంగా రాయలసీమ జిల్లాలలో మరియు ప్రకాశం జిల్లాలో తగినంత పశుగ్రాసం ప్రభుత్వం ఉచితంగా అందించాలని తీర్మానించారు.

ప్రస్తుత సీజన్లో యూరియా డిఎపి లను కొరత లేకుండా యాప్ లు లేకుండా రైతులందరికి కావలసినంత సరుకును ప్రభుత్వం తక్షణం ఆర్బికే ల ద్వారా సరఫరా చేయాలనీ తీర్మానించారు.

పొగాకు రైతులకు కిలో పొగాకు 300 రూపాయలకు కొనుగోలు చేసేవిధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల స్థిరీకరణ నిధి రూ. 1000 కోట్లు కేటాయించి అన్ని రకాల పొగాకును కొనుగోలు చేయాలనీ తీర్మానించారు. ఇండెంట్ ఇచ్చిన కంపెనీలు పొగాకు కొనుగోలు చెయ్యని పక్షంలో వాటిని రాష్ట్రము నుండి బహిష్కరించాలని తీర్మానించారు.

ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టమాటా రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టమాటా ఉత్పత్తుల నిమిత్తం వాల్యూఏయేటర్ పరిశ్రమను నెలకొల్పాలని, కోల్డ్ స్టోరేజీలు తక్షణం నిర్మించాలని, కిలో టమాటో రూ. 30 కి కొనుగోలు చేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తీర్మానించారు.

ఆక్వా రైతులందరికీ తక్షణం యూనిట్ విద్యుత్తు ధర రూ.1-50 పైసలకు అందించాలని, 100 కౌంట్ గల కిలో రొయ్యలకు కనీస మద్దతు ధర రూ. 300 లు గా కొనుగోలు చేయాలనీ, పెరికిన సీడ్ ధరలను తక్షణం తగ్గించాలని తీర్మానించారు.

రాష్ట్రములోని బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధర కిలో 10 రూపాయలుగా కొనుగోలు చేయాలనీ, రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ కోసం రూ. 5000 కోట్లు కేటాయించాలని తీర్మానించారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో డ్రైనేజ్ వ్యవస్థలను ఆధునీకరించాలని, నక్కపల్లి మండలంలో భూసేకరణ నిమిత్తం 2013 లో ఇచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం అమలు చేయాలనీ తీర్మానించారు.

ఇటీవల దేశ రాజధానిలో విద్యార్థులు చేసిన ఉద్యమానికి భారత పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఉద్యమాన్ని అభినందిస్తూ రాహుల్ గాంధీ పాత్రను ఈ దేశ ప్రజలు గుర్తించారని, ఆయనను భావి ప్రధానిగా ప్రజలు నిర్ణయించుకున్నారని కొనియాడారు.

ఈ సమావేశంలో పిసిసి వైస్ ప్రెసిడెంట్, అడ్మిన్ ఇన్ ఛార్జ్ కొలనుకొండ శివాజీ ముఖ్య అతిధిగా హాజరైనారు. శివాజీ మాట్లాడుతూ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్రంలోని వివిధ సమస్యలపై పోరాటాలు చేయాలనీ, రైతులకు అండగా నిలవాలని, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన్ ప్రభాకర రావు చేస్తున్న కృషిని, రాష్ట్ర కిసాన్ నాయకులు చేస్తున్న కృషిని అభినందించారు. వీరికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆశీస్సులు ఎల్లప్పుడూ వుంటాయని తెలియజేసారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ వైస్ చైర్మన్లు మంగటి గోపాల్ రెడ్డి, కాకర్ల హరిబాబు, మడంశెట్టి వేదాద్రి, దేసినీడి వుదయఃస్కర రావులు, వివిధ జిల్లాల చైర్మన్లు కే.జనార్ధన రెడ్డి, అల్లూరి మధురాజు, పంగి గంగాధర్, మట్టపర్తి రామమోహన్ రావు, బోనం రవికుమార్, ఆది రామమోహన్ రావు, బండ్ల సుబ్బారాయులు గౌడ్, గుమ్మళ్ల గోవిందా రావు, మేడిశెట్టి నారయ్య, తుమ్మల నాగేశ్వర రావు, సిహెచ్ వేణుగోపాల్, ఎం.బాబీ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *