ఠాగూర్ గ్రంథాలయంలో మండలి వెంకట కృష్ణారావు  జయంతి వేడుక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో ఈరోజు మండలి వెంకట కృష్ణారావు  జయంతి వేడుక ఘనంగా నిర్వహించబడింది. గ్రంథాలయాధికారికే రమాదేవి ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన గురించి మాట్లాడుతూ ప్రముఖ విద్యావేత్త సంఘ సేవకులు తెలుగు భాష- సంస్కృతి పరిరక్షకుడు విశేష కృషి చేశారు. అంతేకాక యువతలో జ్ఞాన దాహాన్ని పెంచడం వంటి అంశాలను ఆయన ఇచ్చిన ప్రాధాన్యత నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు ఆచరణలో పెట్టాలని ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది వై. ధనలక్ష్మి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *