Breaking News

సౌదీలో చిక్కుకున్న భవానిపురం యువకుడికి ఊరట

-ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో స్వదేశానికి..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సౌదీలో చిక్కుకు పోయిన బాధితుడు శీలం సురేష్ రెడ్డి ను ఇండియాకు తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక చొరవ చూపారు. విజయవాడ, భవాని పురానికి చెందిన సురేష్ పది నెలల క్రితం
ఉపాధి కోసం సౌదీ వెళ్ళి ఏ సీ టెక్నీషియన్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అక్కడ కాంట్రాక్టర్ గత నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకుండా, ఆహారం, ఆశ్రయం వంటి కనీస అవసరాలు కల్పించకుండా ఇబ్బందులు పెట్టాడన్నారు. స్వదేశానికి రాకుండా అడ్డుకుంటున్నాడని కుటుంబ సభ్యులకు చెప్పుకొని ఆవేదన చెందాడు. సురేష్ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్లారు. సురేష్ ను ఇండియాకు రప్పించేందుకు ఎమ్మెల్యే సుజనా ప్రత్యేక చొరవ చూపారు. త్వరితగతిన ఇండియన్ ఎంబసీ తో మాట్లాడి చర్యలు తీసుకున్నారు. బాధితుడు సురేష్ స్వదేశానికి వచ్చిన తర్వాత మంగళవారం, భవానిపురం ఎన్డీయే కార్యాలయానికి వచ్చి సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే సుజనా చౌదరి కు కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *