Breaking News

పీఎం సూర్యఘర్, ఆర్‌డీఎస్‌ఎస్ పనుల వేగం పెంచాలి

-ఆగస్టు లోపు పనులు పూర్తి చేయని సూర్యఘర్ వెండార్లపై చర్యలు
-కొత్త సబ్‌స్టేషన్లతో పాటు పెండింగ్ సబ్ స్టేషన్ ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి
-ఫిర్యాదులు వచ్చే జిల్లాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి
-ఎస్పీడీసీఎల్ సమీక్షలో మంత్రి ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయంగా వినియోగదారులకు అందించేలా అన్ని స్థాయిల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశించారు. ఎస్పీడీసీఎల్ అధికారులతో మంగళవారం నాడు సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పీఎం సూర్యఘర్, ఆర్‌డీఎస్‌ఎస్ పనులు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, సబ్‌స్టేషన్ల నిర్మాణం, విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యలు తదితర అంశాలను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.., పీఎం సూర్యఘర్ పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గృహాలపై సోలార్ వ్యవస్థల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత లక్ష్యాలకు అనుగుణంగా అమలు జరిగేలా చూడాలని సూచించారు. నిబంధనల ప్రకారం ఆగస్టు నెలాఖరు లోపు పనులు పూర్తి చేయని సూర్యఘర్ వెండర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పనుల నాణ్యతతో పాటు గడువు లోపు అమలుపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని పేర్కొన్నారు. ఆర్‌డీఎస్‌ఎస్ పరిధిలో చేపడుతున్న విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునికీకరించే ఇటువంటి పనుల్లో జాప్యానికి తావు లేకుండా చూడాలని మంత్రి సూచించారు. అదేవిధంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు ప్రక్రియను మరింత వేగవంతం చేసి, పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి, విద్యుత్ రంగంపై పడే ప్రభావానికి అనుగుణంగా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

ఫిర్యాదులు రాకుండా సేవలు అందించాలి…

ఎస్పీడీసీఎల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న 62 సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే వివిధ కారణాలతో గత కొంతకాలంగా నిర్మాణం ఆలస్యమవుతున్న 16 సబ్‌స్టేషన్ల పనులు కూడా వెంటనే ప్రారంభం అయ్యేలా సమస్యలు పరిష్కారం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తయితే విద్యుత్ సరఫరా సామర్థ్యం పెరగడంతో పాటు లో వోల్టేజ్, విద్యుత్ అంతరాయాల సమస్యలు గణనీయంగా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలోని కొన్ని జిల్లాల్లో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యలు కొనసాగుతున్నాయని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిపై ప్రజల నుంచి మరిన్ని ఫిర్యాదులు రాకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సంబంధిత సూపరింటెండెంట్ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సంతృప్తి స్థాయిలు పెరిగేలా, వారికి నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా అందేలా అన్ని స్థాయిల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. సేవల నాణ్యతను మెరుగుపరచడం, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయడం, విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు పాల్గొనగా, వివిధ జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, జిల్లా స్థాయి విద్యుత్ శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *