విజయవాడలో ‘పవర్’ సినిమాకు క్లాప్ కొట్టి ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలో చిన్న సినిమాగా రూపొందుతున్న “పవర్” చిత్రం గురువారం నాడు ప్రారంభమైంది. వీఆర్పీ క్రియేషన్స్ పతాకంపై వెంకటరమణ పసుపులేటి దర్శకత్వంలో పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిన్న సినిమా ముహూర్తపు సన్నివేశానికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కెమెరా స్విచ్ ఆన్ చేసి, తొలి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. పరిమిత బడ్జెట్‌తో నూతన ఆలోచనలతో వస్తున్న ‘పవర్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. చిత్రయూనిట్‌కు తన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, సినిమా విజవంతం కావాలని శుభాకాంక్షలు అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *