విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చట్ట సభల్లో బీసీ లకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాతీయ లాకా వెంగళరావు యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నరసింహారావు డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీనగర్ ఆలపాటీ ఫంక్షన్ హాల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో బీసీ లకు 34 శాతం ఇచ్చారు. 24 శాతానికి కుదించారు. జనాభా పెరుగుతున్న రిజర్వేషన్ల పెరగడం లేదు. దామాషా ప్రకారం 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మెడికల్ సీట్లలో అన్యాయం జరుగుతుందన్నారు. బీసీ వర్గాల ఓట్లతో అధికారం చేపట్టి వారికీ న్యాయం చేయకపోవడం దారుణం అన్నారు. మహిళా రిజర్వేషన్లలో సబ్ కోటా పెట్టాలన్నారు.
ఆవుల నరసింహారావు మాట్లాడుతూ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు జరగనివ్వం. ప్రభుత్వం తూతూ మంత్రంగా వ్యవహరిస్తోంది. కేంద్రంలో భాగస్వామ్యంలో ఉండి మాకు న్యాయం చేయడం లేదని ప్రభుత్వం పై మండిపడ్డారు. పోతుల సునీత మాట్లాడుతూ 50 శాతం ఉన్నా 44 శాతమే అడుగుతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం పెరగాలన్నారు. డాక్టర్ అలా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. 102 జీ వో తెచ్చింది దాని వల్ల బీసీ విద్యార్ధులకు నష్టం జరుగుతుంది. మాకు అసలు నష్టం ప్రభుత్వంతోనే. ఏ ఒక్క విద్యార్ది కి నష్టం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతన్నారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నగర అధ్యక్షుడు శిరం నాగ మల్లేశ్వరరావు, పోతుల సురేష్, గోగుల వెంకట రమణ, కోటం రాజు, నక్కా శ్రీనివాస్, చంద్రమౌళి, నమ్మి అప్పారావు, అలా వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News