విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బహుజన వీరుడు గోల్కొండ కోటను పాలించిన సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ జయంతిని ఆగస్టు 18 ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జై గౌడ సేన జాతీయ అధ్యక్షుడు మోర్ల ఏడుకొండలు గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ వేదికగా నిర్వహించిన బహుజన సర్దారులు సర్వాయి పాపన్న, గౌతు లచ్చన్నల జయంతి వేడుకల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మోర్ల ఏడుకొండలు గౌడ్ మాట్లాడుతూ… తమ డిమాండ్లను తెలిపారు. అధికారిక వేడుకలు గత ఏడాది తమ డిమాండ్ మేరకు గౌతు లచ్చన్న జయంతిని ఆగస్టు 16 ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినట్లే సర్వాయి పాపన్న జయంతిని కూడా అధికారికంగా జరపాలని వారు కోరారు. దీనిపై ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్,మ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణలకు వినతి పత్రాలు అందజేశామన్నారు. ఆదరణ పథకం గౌడ కులస్తులకు ఆదరణ పథకం కింద మోపెట్లను పంపిణీ చేయాలని కోరారు. ఆర్థిక సహాయం వర్షాకాలంలో గీత వృత్తి లేని సమయంలో మత్స్యకారులకు ఇస్తున్నట్లే గీత కార్మికులకు కూడా ఏటా రూ. 25,000 ఆర్థిక సహాయం అందించాలన్నారు. రాజధానిలో స్థలం అమరావతి రాజధాని ప్రాంతంలో గౌడ భవనం విద్యార్థి వసతి గృహం మరియు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం ఐదు ఎకరాల భూమితో పాటు అవసరమైన నిధులను కేటాయించాలని కోరారు. తెలంగాణలో పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న జీవోను కూడా ఏపీ ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాపన్న లచ్చన్నల చిత్రపటాలతో కూడిన జెండాలు కండువాలను ఉచితంగా పంపిణీ చేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రచురించిన సర్వాయి పాపన్న చరిత్రకు సంబంధించిన ఏ సోషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ ఎయిట్ ఇండియన్ లైవ్స్ పుస్తకాన్ని ఈ సందర్భంగా అందరికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి గౌడ నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News