జక్కులనెక్కలంలో ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

-రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన పీసీ వాల్, సీసీ డ్రైన్లు, కల్వర్టులు, సిమెంట్ రోడ్ల ప్రారంభం
-జక్కులనెక్కలం గ్రామంలో ఇప్పటి వరకు రూ.1.43 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం: ఎమ్మెల్యే
-హైవే – జక్కులనెక్కలం బీటీ రోడ్డుకు రూ.1.26 కోట్లు మంజూరు.. త్వరలో పనులు ప్రారంభం
-గ్రామంలో 474 మందికి ఇంటి వద్దే ఉచిత రక్త పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం
-గత ఐదేళ్లలో జరగని అభివృద్ధి రెండేళ్లలో చేసి చూపించా : ఎమ్మెల్యే
-రెండేళ్లలోనే జక్కులనెక్కలం గ్రామాన్ని ఏడు సార్లు సందర్శించాను: యార్లగడ్డ
-ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్యే
-గన్నవరం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: యార్లగడ్డ వెంకట్రావు

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం మండలం జక్కులనెక్కలం గ్రామంలో నిర్వహించిన ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, గన్నవరం నియోజకవర్గంలో చేపట్టిన పనులను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన పీసీ వాల్, సీసీ డ్రైన్లు, కల్వర్టులు, సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జక్కులనెక్కలం వంటి చిన్న గ్రామానికే రూ.1.43 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి రెండు కొత్త 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు రూ.30 లక్షలతో పనులు చేసినట్లు చెప్పారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు రూ.50 లక్షలు, అంగన్‌వాడీ కేంద్ర ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.5 లక్షలు, కాలువ అభివృద్ధి పనులకు రూ.60 లక్షలు తో అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. హైవే నుంచి జక్కులనెక్కలం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.26 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ప్రస్తుతం టెండర్ దశలో ఉన్న ఈ పనులు త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామంలో 705 ఓట్లు ఉండగా 474 మంది గ్రామస్తులకు ఇంటి వద్దే ఉచిత రక్త పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ముస్తాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, నర్సులు, సిబ్బంది సమిష్టి కృషితో ఈ కార్యక్రమం విజయవంతమైందని కొనియాడారు. ఈ విధానాన్ని ఇతర గ్రామాల్లో కూడా అమలు చేయాలని సూచించారు. ప్రజలు ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ముందస్తు ఆరోగ్య పరీక్షల ద్వారా వ్యాధులను గుర్తించి చికిత్స అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎన్నికల్లో 3 వంతెనల నిర్మాణం కోసం హామీ ఇచ్చానని ఇప్పటికే ఒక వంతెనకు ఆమోదం లభించిందని, మిగిలిన రెండింటికీ కూడా నిధులు తీసుకొచ్చి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఈ గ్రామానికి తగిన అభివృద్ధి జరగలేదని, గత ఐదేళ్లలో రూ.25 లక్షల పనులు కూడా జరగని పరిస్థితి ఉండగా, ప్రస్తుతం భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వారు గ్రామానికి అరుదుగా వచ్చారని, తాను మాత్రం రెండేళ్లలోనే సుమారు ఏడు సార్లు గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నానని యార్లగడ్డ తెలిపారు. పశుగ్రాస కొరత ఏర్పడిన సమయంలో కామధేను వారి సహకారంతో ఉచితంగా పశువులకు దాణా పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *