“సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, “సుజనా ఫౌండేషన్” ద్వారా ప్రతి శని, ఆదివారలలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. 47వ డివిజన్, సర్కిల్ వన్ కార్యాలయం వద్ద ఆదివారం కూడా నిర్వహించిన “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ వైద్య శిబిరంలో కంటి పరీక్షలు , ఈ సీ జీ, 2డి ఎకో, ఎక్స్ రే, బీ పీ, షుగర్ వంటి రక్త పరీక్షలతో పాటు జనరల్ ఫిజీషియన్స్ వైద్య సేవలందించారు. కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ వైద్య శిబిరంలో 103 మందికి నిపుణులైన వైద్యుల బృందం ప్రత్యేక శ్రద్ధతో చికిత్సలు అందించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఎన్డీయే కూటమి నేతలు నాగోతి రామారావు, వెంపలి గౌరీ శంకర్, ఆకారపు విజయ కుమారి, పోతినీడి లోకేష్, పగిడిపల్లి ప్రభు చరణ్, చొక్కర పాపారావు, కోటేశ్వరరావు, అమరావతి ఐ హాస్పిటల్ వైద్యులు, పీ వీ ఆర్ హాస్పిటల్స్ వైద్యులు, సుజనా ఫౌండేషన్ సిబ్బంది ,సుజనా మిత్రా కోఆర్డినేటర్లు ఈ శిబిరంలో తమ సేవలందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *