పుస్తకాలతో స్నేహం-విజ్ఞానంతో వికాసం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో ఆదివారం జాతీయ పుస్తక ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పుస్తక పఠనం పుస్తక ల ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి రమాదేవి మాట్లాడుతూ పుస్తకాలు మనిషికి మంచి మిత్రులు పుస్తక పఠనం ద్వారా  విజ్ఞానం, ఆలోచన శక్తి, సృజనాత్మకత మరియు వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయి అని తెలిపారు. తలదించి నన్ను చూడు… నువ్వు తల ఎత్తుకునేలా చేస్తాను అంటుంది పుస్తకం. కాబట్టి విద్యార్థులు రోజులో కొంత సమయమన్నా పుస్తక పఠనం చేయాలని కోరుకుంటున్నాను తద్వారా సమాజం, చరిత్ర, సంస్కృతి, విజ్ఞానం మరియు ప్రపంచాన్ని అర్థం చేసుకునే అవకాశం కల్పిస్తాయి కాబట్టి ప్రతి విద్యార్థి పుస్తక పటనం అలవాటు చేసుకోవాలని కోరుచున్నాను. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది జి ఉమారాణి, డి నాగేశ్వరరావు, వంశీ విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *